ప్రస్తుతం ప్రపంచ దేశాలను వెంటాడుతూ వేధిస్తున్న కరోనా రోజు రోజుకీ తన ఉగ్రరూపాన్ని మరింత పెంచుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అసలు కరోనా గురించి ఆలోచించకుండా మరిచిపోవడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. లక్షల్లో పెరుగుతున్న కేసులు సంచలనం సృష్టిస్తూ కరోనా మరణాలు జనాలను భయపెడుతున్నాయి.