దేశంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కోరలు చాచిన కరోనా తన ప్రభావాన్ని పెంచుతూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా రోగుల మరణానికి ప్రధాన కారణం ఆక్సిజన్ అందక పోవడం అన్న విషయం విధితమే. అది తెలిసినప్పటికీ వారందరికీ ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టలేని పరిస్థితి. కారణం ఆక్సిజన్ కొరత.