దేశంలో కరోనా కేసుల పర్వం కొనసాగుతోంది. దీనిపై పట్టు సాధించాలని ప్రభుత్వాలు వైద్య బృందాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. అయినా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విఫలమవుతున్నారు. కొంతమంది మేధావులు పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టడంతోనే కరోనా వ్యాప్తిని ఆపగలం అని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటికే గత సంవత్సరం కరోనా తాకిడికి దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది.