అనుకున్న విధంగానే కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను అమలులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండడం, రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడం అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు.