కేరళ రాష్ట్రం మొదటి నుండి కూడా మంచి మంచి నిర్ణయాలతో ప్రజల క్షేమం కోసం కృషి చేస్తూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయాలు ఎప్పుడూ ప్రజల క్షేమమే పరమావధిగా ఉంటాయి. దీని కారణంగానే కేరళ ప్రజలు పినరయి విజయన్ పరిపాలనపై నమ్మకంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎల్డిఎఫ్ పార్టీకి భారీ విజయాన్ని అందించారు.