తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఒక వైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, మరో వైపు ప్రభుత్వానికి ఈటల రాజేందర్ కి మధ్యన వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా కోర్టు కూడా ప్రభుత్వం తీరును తప్పు బట్టింది.