ఎక్కడో చైనాలో పుట్టి మన దేశానికి తరలివచ్చి, వేట మొదలు పెట్టిన కరోనా రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ఈ మాయదారి వైరస్ తన మన అనే భేదం లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు గ్రామాలకు సైతం పాకింది.