దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం మరియు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం అనుకున్న స్థాయిలో వైరస్ వ్యాప్తిపై చూపుతున్నట్లు కనిపించడం లేదు. దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య కొంతమేర తగ్గుతున్నప్పటికి, మరణాల రేటు మాత్రం భారీగా పెరుగుతుండడంతో ప్రజల గుండెల్లో వణుకుపుడుతోంది.