ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రాజుగారు, అదే పార్టీపై రివర్స్ అయ్యి రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ నిత్యం రచ్చబండ కార్యక్రమం పేరిట మీడియా సమావేశం నిర్వహిస్తూ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.