బొత్స సత్యనారాయణ....ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన బొత్స, ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు. జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు విజయనగరం జిల్లాపై ఎంత పట్టు ఉందో చెప్పాల్సిన పని లేదు. జిల్లాలో ఈయన ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా సరే బొత్స చీపురుపల్లిలో భారీగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు.