దేశంలో ప్రజలు కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయంలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. పాజిటివ్ కేసులు, కరోనా మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదు అవుతూ రోజురోజుకీ పరిస్థితి చేయిదాటుతోంది. నిత్యం నాలుగువేల మంది కరోనా రోగులు మరణిస్తుండడం ప్రమాద స్థాయిని సూచిస్తోంది.