కరోనా వైరస్ భారతదేశంలో కట్టలు తెంచుకుంటోంది. గత రెండు రోజుల నుండి మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీనితో ప్రజల్లో ఆందోళనలు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసే పనిలో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి.