ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగిందల్లా జాగ్రత్త వహించడం మాత్రమే. కరోనా తొలిదశతో పోలిస్తే, రెండవ దశ తీవ్రత భారీగా పెరిగింది. ఓ వైపు లాక్ డౌన్, మరోవైపు కఠిన కరోనా నిబంధనలు ఎంత పాటిస్తున్నా ఈ మహమ్మారి అదుపులోకి రావడం లేదు.