ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేని బలం ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో భారీగా సీట్లు దక్కించుకుని అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతిపక్ష టీడీపీ పోటీ ఇవ్వలేకపోతుంది. ఆ ఎన్నికల్లోనే పార్టీ ఘోరంగా ఓడిపోయి, పూర్తి కష్టాల్లోకి వెళ్లిపోయింది. పైగా జగన్ ఇమేజ్ ముందు చంద్రబాబు నిలవలేకపోతున్నారు. అసలు జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు ఏదొరకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు.