పయ్యావుల కేశవ్...టీడీపీలో సీనియర్ నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉన్నారు. 1994 ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఇక 1999 ఎన్నికల్లో కేశవ్ ఓటమి పాలవ్వగా, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004కి వచ్చేసరికి కేశవ్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగా టీడీపీ అధికారం కోల్పోయింది. ఇక కేశవ్‌కు 2009 కూడా కలిసి రాలేదు. అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు.