మొదటి తొలిదశలో 40 ఏళ్లు పైబడిన వారిపై, వృద్ధులపై ఎక్కువగా దాడి చేసిన కరోనా వైరస్ రెండవ దశలో తన ప్రభావాన్ని మరింత పెంచింది. ఈ సారి ఏకంగా యువతనే టార్గెట్ చేసి విజృంభిస్తోంది. 25 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు సైతం కరోనా తాకిడికి తట్టుకోలేక ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండడం చూస్తుంటే యువతపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో తెలుస్తోంది.