దేశంలో ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పవచ్చు. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో పాటుగా, ఈ బ్లాక్ ఫంగస్ ప్రజలను మరింత భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కరోనా వచ్చి కోలుకున్న వారిలో వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్ రావడానికి గల కారణాలపై వైద్యులు ప్రత్యేక ద్రుష్టి సారించారు.