దేశంలో కరోనా ఉద్ధృతికి హద్దు అదుపూ లేకుండా పోయింది. ఎటు చూసినా కరోనా కేసులే. ఏ నోట విన్నా కరోనా మరణాల సంక్షోభమే. ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడటానికి తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులపై కూడా ఏమాత్రం కనికరం చూపించడం లేదు ఈ వైరస్.