విజయనగరం జిల్లా చీపురుపల్లి....బొత్స సత్యనారాయణ కంచుకోట. బొత్స ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలవడం ఖాయం అనేలా చీపురుపల్లి రాజకీయాలు ఉంటాయి. 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. అయినా సరే 2014 ఎన్నికల్లో బొత్స కాంగ్రెస్ తరుపున చీపురుపల్లి నుంచి బరిలో దిగి, 42 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన మృణాలిని 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.