ఏపీ అసెంబ్లీ ఒక్కరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ 2021-22 వార్షిక బడ్జెట్ను సమర్పించారు. ఈ బడ్జెట్ లో మహిళలకు మరియు చిన్నారులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కల్పిస్తూ నివేదికను ప్రవేశపెట్టారు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటినుండి పేద ప్రజలకు, మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరేలా సంస్కరణలు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.