ఓ వైపు దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటే, కొత్తగా మరో వైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ తో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలవరపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడుతున్న సమయంలో ఈ బ్లాక్ ఫంగస్ ప్రమాదకరంగా మారుతోంది.