ఏపీ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు చాలా సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న యనమల తూర్పు గోదావరి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. అలాగే తునిలో ఈయనకు తిరుగులేదు. 1983 నుంచి 2004 వరకు తుని నుంచి ఆరుసార్లు విజయం సాధించారు. ఇక 2009లో ఈయనకు తొలిసారి ఓటమి ఎదురైంది. 2014 ఎన్నికలోచ్చేసరికి యనమల ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని, ఆయన తమ్ముడు యనమల కృష్ణుడుని తుని బరిలో నిలిపారు.