దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. జనాలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఏదో ఒక చిన్న పొరపాటుతో వారిపై దాడి చేసి అనారోగ్య పాలయ్యేలా చేస్తోంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందని ఇటీవలే గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.