రాజకీయాల్లో పార్టీ జంపింగులు అనేవి సర్వసాధారణమే. ఎన్నో ఏళ్ల నుంచి ఈ జంపింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారం బట్టి రాజకీయ నాయకులు ప్లేట్ తిప్పేస్తుంటారు. ఇలా ప్లేట్ తిప్పేవాళ్లు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగానే ఉన్నారు. అయితే అలా ప్లేట్ తిప్పేసివారిని ప్రజలు తిరస్కరించడం కూడా సాధారణంగా జరిగిపోతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకున్నారు.