కరోనా వైరస్ తన వీరంగాన్ని ఇంకా ఆపలేదు. కేసులు సంఖ్యలో మార్పు ఉన్నా కానీ, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయనే వార్త ప్రజలను తీవ్రంగా కలచి వేస్తోంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు చెప్పకపోయినా, లోలోపల చింతిస్తూ ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.