తెలంగాణ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తన పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టగల దిట్ట రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగల అతి కొద్ది మంది వ్యక్తులలో రేవంత్ రెడ్డి ఒకరు. తెలంగాణ ప్రభుత్వంపై వారు అమలు చేస్తున్న వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ధీరోదాత్తుడు.