ఏపీలో చాలామంది టీడీపీ నాయకులు రాజకీయాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదనే సంగతి తెల్సిందే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పలువురు నాయకులు టీడీపీని వదిలేసి, వైసీపీలోకి జంప్ కొట్టేశారు. ఇక మరికొందరు నాయకులు జగన్ ప్రభుత్వం దెబ్బకు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. గత రెండేళ్ల నుంచి పార్టీ తరుపున నాయకులు పోరాడిన సందర్భాలు లేవు. అలాగే పలు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేయడం లేదు.