జగన్ కేబినెట్లో బాగా దూకుడుగా ఉండే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. నెల్లూరు సిటీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్, జగన్ కేబినెట్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక మంత్రిగా అనిల్ దూసుకెళుతున్నారు. ఓ వైపు తన శాఖపై పట్టు పెంచుకుంటూనే, మరోవైపు ప్రతిపక్ష టీడీపీకి చెక్ పెట్టడంలో ముందున్నారు.