ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులకు కేంద్ర రాజకీయాల్లో మంచి పట్టు ఉండేది. అటు కాంగ్రెస్ నాయకులు కావొచ్చు, ఇటు టీడీపీ నాయకులు కావొచ్చు కేంద్రం రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ చాలా ఏళ్ళు కేంద్రంలో చక్రం తిప్పింది. ఎన్టీఆర్, చంద్రబాబులు కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.