ప్రతిపక్ష టీడీపీలో నిత్యం హైలైట్ అయ్యే ఎమ్మెల్యేల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒకరు. ఈయన ఏదొక విధంగా మీడియా, సోషల్ మీడియాల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇలా మీడియా, సోషల్ మీడియాలోనే కాదు ప్రజల్లో కూడా నిత్యం ఉంటారు. అందుకే పాలకొల్లులో నిమ్మల రామానాయుడుకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తొలిసారి 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు, తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి సేవ చేశారు.