గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఏపీలో టీడీపీ పరిస్తితి ఏమి బాగోలేదన్న సంగతి తెలిసిందే. ఎన్నికలై రెండేళ్ళు అయిపోయినా సరే ఒక్క జిల్లా అంటే ఒక్క జిల్లాలో కూడా టీడీపే పుంజుకోలేదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పూర్తిగా వైసీపీ గాలి వీచింది. అసలు టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.