రామ్మోహన్ నాయుడు...తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో రామ్మోహన్ కూడా ఒకరు. తనదైన శైలిలో అనర్గళంగా మాట్లాడుతూ, అందరి దృష్టిని ఆకర్షించే రామ్మోహన్, లోక్సభలో ఏ విధంగా పోరాడుతున్నారో తెలిసిందే. సాధారణంగా తెలుగు ఎంపీలకు కేంద్రంలో పెద్ద విలువ ఉండదు. అలాగే వారికి ఇంగ్లీష్, హిందీ బాషలపై పెద్దగా పట్టు ఉండదు కాబట్టి, లోక్సభలో రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడలేరు.