ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో నాయకులు ఎంత తిట్టుకుంటే అంత ఎక్కువగా మైలేజ్ వస్తుందనే విధంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో నాయకులు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునేవారు. అప్పట్లో ప్రత్యర్ధులుగా ఉన్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు చాలా హుందాగా రాజకీయాలు చేసేవారు. ఎప్పుడన్నా పొరపాటున తప్పుగా మాట్లాడితే వెంటనే క్షమాపణ చెప్పేవారు.