రాష్ట్రం విడిపోయి 7 ఏళ్ళు దాటేసింది. ఈ ఏడేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ బాగుపడింది ఏమి లేదు. కేంద్రం ఇస్తానన్న హామీలు ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదు. రాష్ట్రంలో అధికారాలు మారుతున్నాయి గానీ, రాష్ట్ర ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని సింగపూర్ చేసేస్తానని హడావిడి చేసేశారు.