ప్రపంచ జీవన శైలిని అడ్డ దిడ్డంగా మార్చేసింది ఈ కరోనా మహమ్మారి. ఈ వైరస్ మానవాళి మనుగడకు పెద్ద అడ్డంకిగా మారి ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఇంకా ఎన్ని రోజులు దీంతో పోరాటం సాగుతుందో తెలియని పరిస్థితి. అయినా ఇది పూర్తిగా ఈ భూమిని విడిచి వెళ్ళేలా అనిపించడం లేదని కొందరు మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.