తెలంగాణ రాజకీయాలు గత రెండు నెలల నుండి మంచి జోరుమీదున్నాయి. మామూలుగా రాజకీయాల్లో అధికార పార్టీ మరియు విపక్షాలకు మధ్యన వాదోపవాదాలు జరగడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం సరాసరి అధికార తెరాసా లోనే వివాదాలు రాజుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడిన కారణంగా ఆయనపై విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.