మనిషి జీవించడానికి పర్యావరణం ఎంతగా దోహద పడుతుందో అందరికీ తెలిసిందే. అయినా సరే మానవుడు నిత్య అవసరాల నిమిత్తం కొంత, టెక్నాలజీ పేరుతో కొంత, ఇలా రకరకాలుగా పర్యావరణానికి హాని కలిగిస్తూ వస్తున్నాడు. కానీ పర్యావరణం నాశనం అయ్యే కొద్దీ మనిషి మనుగడకు మరింత ముప్పు పెరుగుతూనే ఉంటుంది అన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.