కరోనా థర్డ్ వేవ్ పై పలు ఆసక్తికర విషయాలను సూచనలను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలియచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గినట్లేనని, కానీ కరోనా మూడవ దశ మరో మూడు నాలుగు నెలల్లో ఉండబోతోంది అన్న విషయాన్ని ఏ మాత్రం విస్మరించినా, అలక్ష్యం చేసినా భారీ మూల్యం తప్పదని ప్రముఖులు హెచ్చరిస్తున్న మాట వాస్తవమే.