తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు ఏ మాత్రం కొదవ లేదనే చెప్పాలి. ఆ పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపించే నాయకులు చాలామంది ఉన్నారు. అలాగే ఆ పార్టీకి అనేకమంది అధికార ప్రతినిధులు ఉన్నారు. ఇక వీరి పని జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపడమే. కానీ చాలాకాలం నుంచి టీడీపీలో ఎక్కువమంది అధికార ప్రతినిధుల వాయిస్ బయటకు రావడం లేదు. మీడియా సమావేశాల్లో గానీ, టీవీ డిబేట్లలో ఒకే ఒక్కరు బాగా కనిపిస్తున్నారు.