అచ్చెన్నాయుడు...ఏపీ టీడీపీకి అధ్యక్షుడు. అధ్యక్ష స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఎప్పుడు ఒకే రకమైన రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక చంద్రబాబుకు, సొంత పార్టీ లీడర్ల మద్ధతు చాలా తక్కువైపోయిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం నిత్యం బాబుకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు.