తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కరోనా నియంత్రణలో భాగంగా అధికార పార్టీ మరియు ప్రభుత్వ అధికారులు తలమునకలై ఉన్నారు. మరో వైపు త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవలే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి అలాగే తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.