రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీల విషయం మరోసారి రాజకీయ కాక పుట్టిస్తోంది. శాసన సభ్యుల ప్రాతినిధ్యంతో ఉండే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇవి పూర్తిగా వైసీపీకే దక్కకున్నాయి. వాస్తవానికి ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే.. ఈ మూడు సీట్లకు భారీ ఎత్తున పోటీ ఉండడం గమనార్హం. దీంతో ఎవరికి ఈ పీఠాలు దక్కుతాయనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇక్కడ ఖాళీగా ఉన్నది మూడు స్థానాలే అయినా రేసులో ఉన్న నేతల సంఖ్య మాత్రం చాంతాడంత ఉంది.