ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ వేగంగా మార్పు చెందుతున్నాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపుపై ముందు నుండి గట్టి నమ్మకాన్ని పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ఆ దిశగా అన్ని ప్రయత్నాలను చేసింది. ఇందులో భాగంగానే అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రధాన నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.