గత రెండు సంవత్సరాల నుండి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా వైరస్. ఇప్పటికీ కొన్ని దేశాలలో ఇది తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది దశల వారీగా మానవ జాతిపై తన తీవ్రతను చూపుతూ ఉంది. మొదటి దశలో కరోనా కారణంగా ఎక్కువగా వృద్ధులు దీని బారిన పడ్డారు. రెండవ దశలో అయితే ఇది ఎక్కువగా యువకులపై మరియు 45 సంవత్సరాల వయసు లోపల ఉన్న వారిపై ప్రభావాన్ని చూపింది.