ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వర్సెస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ అదే పార్టీకి వ్యతిరేకంగా చాలాకాలం నుంచి గళం విప్పుతున్న సంగతి కూడా తెలిసిందే. వరుసపెట్టి రఘురామ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రఘురామపై వేటు వేయాలని వైసీపీ ఎంపీలు పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.