సాధారణంగా రాజకీయాలలో ప్రతి పక్షంలో ఉన్న నాయకులు పదే పదే అధికార పార్టీపై విమర్శలు చేయడం చూస్తూ ఉంటాము. కొన్ని విమర్శల్లో వాస్తవం ఉన్నప్పటికీ, ఎక్కువగా విమర్శలు మాత్రం కావాలనే ఏదో ఒక విధంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల ముందు పార్టీని ప్రశ్నార్థకంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు.