టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్.. వచ్చే ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్నే ఎంచుకున్న విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికల్లో ఆయన తొలిసారి క్రియా శీల రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇక్కడ విజయం గ్యారెంటీ అనుకున్నారు. ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఇక్కడ ప్రచారం చేశారు. పోటీ కూడా టఫ్‌గా ఉంటుందని భావించారు. కానీ, ఇక్కడ నుంచి పోటీ చేసిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లతో విజయం దక్కించుకున్నారు.