ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టి టి డి ) చైర్మన్ పదవిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొద్ది రోజుల్లో ఈ పదవిలో ఉన్న వారు గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైనందున. టీటీడీ చైర్మన్ కుర్చీ ఖాళీ అవుతోంది. అయితే ఈ పదవిని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిరిగి వారికే కట్టబెట్టబోతున్నారా, లేక ఇంకెవరికైనా ఇవ్వబోతున్నారా అన్న అంశం ఇప్పుడు ఏపీలో హైలెట్ అవుతోంది.