థర్డ్ వేవ్ లో చిన్నారులు అధికంగా కరోనా భారిన పడే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించి కొన్ని కీలక మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా పెద్దలకు కరోనా చికిత్స కొరకు వాడే ఔషధాలను చిన్నారులకు వాడి ప్రయోగాలు చేయరాదని హెచ్చరించింది.