కరోనా మహమ్మారి రెండో వేవ్‌లో దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజులుపైనే ఈ సెకండ్ వేవ్ దేశ ప్రజలకు చుక్కలు చూపించింది. ఇక కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు వరుస పెట్టి లాక్డౌన్ విధించుకుంటూ వచ్చాయి. అలాగే విద్యార్ధుల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని 10, 12వ తరగతి పరీక్షలని రద్దు చేశాయి. అటు కేంద్ర ప్రభుత్వం సైతం పరీక్షలని రద్దు చేసింది.